telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నువ్వెప్పుడైతే నా లైఫ్ లోకి ఎంటరయ్యావో… భార్యపై నిఖిల్ వ్యాఖ్యలు

Nikhil

యంగ్ హీరో నిఖిల్ లాక్‌డౌన్ సమయంలో మే 14న తన ప్రియురాలు పల్లవిని పెళ్లాడాడు. నిఖిల్ తాజాగా పల్లవిని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్, షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిన్న (సెప్టెంబర్ 3) తన సతీమణి పల్లవి వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఆమెతో దిగిన ఓ పిక్ షేర్ చేస్తూ స్పెషల్‌గా విష్ చేశాడు నిఖిల్. ”హ్యాపీ బర్త్ డే వైఫీ.. నువ్వెప్పుడైతే నా లైఫ్ లోకి ఎంటరయ్యావో… అప్పటి నుంచి అంతా ఆనందమయంగానే ఉంది” అంటూ నిఖిల్ తన భార్యపై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టాడు. పల్లవి తనతో ఎంతో అణకువగా మెదులుతోందని, ఆమె వచ్చాక జీవితం మరింత హాయిగా మారిందని పేర్కొన్నాడు. ఇక చివరగా ‘అర్జున్ సురవరం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నిఖిల్ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ కానున్నాడు. “కార్తికేయ-2″తో పాటు “18 పేజెస్” సినిమాలతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Related posts