telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

15 ఏళ్ళ కూతురు, భార్య మిస్సింగ్… పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ భర్త

Heroine

తమిళ హీరోయిన్ నర్మద తన 15 ఏళ్ల కూతురుతో సహా అదృశ్యం కావడంతో పోలీసుల్ని ఆశ్రయించాడు ఆమె భర్త. తన భార్య నర్మద, కూతురు కనిపించడం లేదంటూ ఆమె భర్త చెన్నై‌లోని తారాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. గత రెండు రోజులుగా తన భార్య కనిపించడం లేదని.. తమ మధ్య ఎలాంటి మనస్పర్ధలు గొడవలు లేవని బంధువులు ఇంటి దగ్గర గాలించినా జాడ తెలియకపోవడంతో పోలీసుల్ని ఆశ్రయించనట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు నర్మద భర్త. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా 1987లో ప్రభు, రాంకీ హీరోలుగా నర్మద హీరోయిన్‌గా వచ్చిన ‘చిన్న పూవే మెల్ల పేసు’ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ సినిమా. ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నర్మద… తరువాత తెరమరుగైంది. అయితే చేసిన ఒక్క సినిమాతోనే మంచి పాపులారిటీ దక్కించుకున్నారు నర్మద. ఆ తరువాత కాలంలో నర్మద ప్రముఖ బిజినెస్ మేన్‌ని పెళ్లి చేసుకుని గృహిణిగా స్థిరపడ్డారు. ఇప్పుడు నర్మదకు 15 ఏళ్ల కూతురు ఉంది.

Related posts