telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హ్యాపీ బర్త్ డే డియర్ మమ్ముట్టి… : చిరంజీవి

Mammootty

ఈరోజు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి 69వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి… మమ్ముట్టికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్విట్టర్లో “హ్యాపీ బర్త్ డే డియర్ మమ్ముట్టి. మీతో కలిసి ఆ అద్భుతమైన సినిమా రంగంలో నేను కూడా హీరోగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. మీరు మరిన్ని సినిమాలు చేయాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. చాలా సంవత్సరాల పాటు ప్రేక్షకులని అలరిస్తూ ఉండండి” అంటూ మమ్ముట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా సూపర్ స్టార్ మహేష్ బాబు, మోహన్ లాల్, పృథ్వీరాజ్ లతో పాటు పలువురుస్టార్ హీరో మమ్ముట్టికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts