telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య సినిమాలో సీనియర్ హీరోయిన్ మీనా ?

Meena

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఇప్పటికే పలు పేర్లు వినిపించాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రకు గాను సీనియర్ హీరోయిన్ మీనాను ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. మీనా ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Related posts