telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గంగవ్వకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

Gangavva

బుల్లి తెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 సందడి మొదలైంది. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 తొలి రోజు 16 మంది కంటెస్టెంట్స్‌ పరిచయంతో సెప్టెంబర్ 6 ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన షో రాత్రి 9 వరకూ సాగింది. అయితే అందులో చాలామంది గురించి ప్రేక్షకులకు అసలు తెలియదనే చెప్పాలి. వరుసగా రెండోసారి వ్యాఖ్యాతగా వ్యవహించిన టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున 16 మంది కంటెస్టెంట్లును బుల్లితెరకు పరిచయం చేశారు. అయితే వీరిలో అందరికంటే ప్రత్యేకంగా నిలిచారు గిరిజన పల్లె నుంచి వచ్చిన గంగవ్వ. గంగవ్వను బిగ్ బాస్ హౌజ్‌లో చూడగానే ఆమె ఫ్యాన్స్, సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో చొప్పదంటి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సైతం గంగవ్వకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఆయన పోస్ట్‌ చేస్తూ.. ‘మా చొప్పదండి నియోజకవర్గ అవ్వ గంగవ్వ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు. మారుమూల పల్లె నుండి తన మాటలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. గంగవ్వ విజేతగా నిలుస్తుందని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఎమ్మె‍ల్యే చేసిన ట్వీట్‌ను గంగవ్వ ఫ్యాన్స్‌ విపరీతంగా రీట్వీట్‌ చేస్తున్నారు. కాగా షో మొదలవ్వడమే ఆలస్యం #Gangavva #BiggBossTelugu4 హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తూ సోషల్‌ మీడియాను ఊపేస్తున్నారు. అంతేకాదు గంగవ్వ ఆర్మీ వచ్చేసిందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. తెలంగాణనే కాకుండా ఏపీ నుంచి కూడా ఆమెకు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు.

Related posts