నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ . వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో నాని సరసన మలయాళ భామ నజ్రియా నటిస్తోంది.
ఈసినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అలాగే ఇప్పటికే విడుదలైన పాటలకు కూడా మించి రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘అనుకుందోటి.. అయిందోటి.. రంగో రంగా’ అంటూ సాగే ఈ పాటకు భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించగా.. కారుణ్య ఆలిపించాడు. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్నిఅందించాడు.
ఇందులో నాని పడుతున్న కష్టాలనుకళ్ళకు కట్టినట్టు చూపించారు.ఈ సినిమాలో నటుడు నరేశ్, నదియా, రోహిణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
కంప్లీట్ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.