ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు ఉమాశంకర్ గణేశ్ నర్సీపట్నం నుంచి వైఎస్సార్పీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. తన సోదరుడు ఎమ్మెల్యేగా గెలవడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు పూరీ జగన్నాథ్. వైఎస్ జగన్ వల్లే తన సోదరుడు ఉమా శంకర్ గణేశ్ విజయం సాధించాడని, అన్నారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన జగన్ కు నేను, నా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు.
గత ఎన్నికల్లో నా తమ్ముడు ఓడిపోయినా, జగన్ మళ్లీ ధైర్యం చెప్పి వెన్నంటి ఉండి ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను రాజకీయాల్లో లేను. కానీ నాకు యోధులంటే చాలా ఇష్టం. తండ్రి చనిపోయాక ఎన్నో అవమానాలు, కష్టాలు అధిగమించి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ నాకు సింహంలా కనబడుతున్నారని పూరీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.