telugu navyamedia
ఆంధ్ర వార్తలు

డ్రైవర్‌’ హత్య కేసు : మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ రవీంద్రనాథ్..

*పోలీసుల ముందు నేరం అంగీకరించిన ఎమ్మెల్సీ
*‘డ్రైవర్‌’ హత్య కేసులో ఉదయ భాస్కర్‌ అరెస్టు
*జూన్‌ 6 వరకు రిమాండ్‌.. రాజమండ్రి జైలుకు
*మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ..
*కొట్టి నెట్టేయడంతో సుబ్రహ్మణ్యం మృతి..
*ప్రమాదంగా చిత్రించేందుకు ఎమ్మెల్సీ ప్లాన్‌..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ హత్య కేసులో మిస్టరీ వీడింది, ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును నిందితుడిగా తేల్చామని కాకినాడ ఎస్పీ రవీంద్ర నాథ్ మీడియాకు తెలిపారు.

Andhra: YSRC MLC arrested for ex-driver's murder- The New Indian Express

సుబ్రహ్మణ్యం తల్లి ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు ఎమ్మెల్సీపై 302 , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు కింద కేసు నమోదు చేశామన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు కోసం ఆరు బృందాలతో గాలించామన్నారు. ఈ గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

Kakinada: Cops hunt for YSRCP MLC Uday Bhaskar

సోమ‌వారం మార్నింగ్ ఎమ్మెల్సీని కస్టడీలోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. అనంతబాబును విచారించి వాంగ్మూలం నమోదు చేశామన్నారు. అనంతరం జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

హత్య ఘటన వివరాలను మీడియాకు వెల్లడించిన ఎస్పీ…

ఈ నెల 19వ తేదీన సుబ్రమణ్యం తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చిన సమయంలో అదే సమయంలో అనంతబాబు అదే రోడ్డుపైకి వచ్చినప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఆ మార్గంలో వెళ్లూ వీళ్లను చూసి ఆగిన‌ట్ట ఎస్పీ చెప్పారు.

ఎమ్మెల్సీ పిలవడంతో సుబ్రహ్మణ్యం ఆ కారులో ఎక్కాడు. ఆ రోడ్డులో అలా ముందుకు వెళ్లాడు. జన్మభూమి పార్కు ఏరియాలో టిఫిన్ తీసుకుని అక్కడ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు ఇంటికి వెళ్లారు. సుబ్రహ్మణ్యం పెళ్లి సమయంలో అనంతబాబు కొంత డబ్బులు ఇచ్చారు. అవి తిరిగి ఇవ్వలేదన్న దానిపై కొంత చర్చ జరిగింది. ప్రవర్తన మార్చుకుంటే మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోమని మీ అమ్మ కోరింది. కానీ నవ్వు పవర్తన మార్చుకోలేదని ఎమ్మెల్సీ.. సుబ్రహ్మణ్యంతో అన్నారు.

kakinada sp on Mlc Anantha Babu: Driver Subramanyam Murder Case: ఎమ్మెల్సీ అనంతబాబు పాత్ర ఇదే.. డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం, విస్తుపోయే నిజాలు వెల్లడించిన ఎస్పీ ...

ప్రవర్తన మార్చుకోలేదన్న విషయంపై వాగ్వాదం జరిగింది. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. సుబ్రహ్మణ్యాన్ని కొట్టడానికి ఎమ్మెల్సీ ముందుకు వెళ్లారు. లిక్కర్ సేవించి ఉండడంతో సుబ్రహ్మణ్యం కూడా తిరగబడ్డాడు. ఎదురుతిరిగి మాట్లాడడంతో ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం మెడపట్టుకుని నెట్టాడు. అపార్ట్ మెంట్ దగ్గర గట్టుపై డ్రైవర్ పడిపోయాడు. తనను కొడతావా అంటూ సుబ్రమణ్యం మరోసారి ఎమ్మెల్సీపై దాడికి ప్రయత్నించడంతో ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి అతడిని నెట్టివేయడంతో మరోసారి తలకు గాయమైందన్నారు.

సుబ్రమణ్యం తలకు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులో తీసుకెళ్లాడని ఎస్పీ చెప్పారు. అయితే మార్గమధ్యంలోని చాలా ఆసుపత్రులు మూసి వేసి ఉన్నాయన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో డాక్టర్లు కూడా అందుబాటులో లేరన్నారు. అయితే ఇదే సమయంలో వెక్కిళ్లు వస్తున్న సుబ్రమణ్యాన్ని నీళ్లు తాగాలని అనంతబాబు వాటర్ బాటిల్ ఇచ్చాడు.ఈ నీళ్లు తాగిన కొద్దిసేపటికే సుబ్రమణ్యం చనిపోయాడు.ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్సీ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని భావించాడని ఎస్పీ చెప్పారు.

గతంలో మద్యం తాగిన సమయంలో సుబ్రమణ్యం రోడ్డు ప్రమాదాలు చేసిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాన్ చేశాడని, ప్రమాదం జరిగినట్లు ఇంట్లో చెబితే అనుమానం రాదని భావించాడు. ఆ తర్వాత మృతదేహాన్ని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఉంటున్న ప్రాంతానికి తీసుకెళ్లి అప్పగించే ప్రయత్నం చేశాడని తెలిపారు.

అయితే సుబ్రమణ్యం శరీరంపై ఉన్న గాయాలను బట్టి రోడ్డు ప్రమాదం కాదని కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీని నిలదీశారని ఎస్పీ చెప్పారు. ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు.

Related posts