టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతల దాడి అంశం.. ఏపీలో పరిణామాలను అడిగి తెలుసుకున్నారు.
మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు పోరాడుతుంటే.. వైసీపీ దాడులకు తెగపడటంతోపాటు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తోందని అమిత్ షాకు చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు జమ్ము కశ్మీర్ పర్యటన నుంచి అమిత్ షా నిన్న ఢిల్లీకి తిరిగి వచ్చారు.
కాగా..ఈ నెల 25, 26 తేదీల్లో ఢిల్లీలో పర్యటనలో భాగంగా రాష్ట్రపతిని కలుసుకున్న చంద్రబాబు.. అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోరారు. అయితే, అమిత్ షాకు వరుస కార్యక్రమాలు ఉండడంతో చంద్రబాబుకు అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీంతో టీడీపీ అధినేతతో అమిత్ షా ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
జగన్ తుగ్లక్ ను మించిన పరిపాలన అందిస్తున్నారు: దేవినేని