ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ స్టోరీ పూర్తి వివరాలు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో తమ ముఖ్యమంత్రి రాసుకుపూసుకు తిరుగుతున్నారని, ఆయనతో తిరిగి తమ ముఖ్యమంత్రి చిక్కులు తెచ్చుకుంటారేమోనని కొందరు వైకాపా నాయకులు అనుమానాలువ్యక్తం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బిజెపి తమకు ఎంతో సహాయం చేసిందని, దీని వల్లే తాము భారీ మెజార్టీతో గెలిచామని ఇప్పుడు అటువంటి పార్టీతోనే జగన్ సున్నం పెట్టుకునే విధంగా కెసిఆర్ చేస్తున్నారనే ఆందోళన ఆపార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి కెసిఆర్ తాను,జగన్ ఒకటేనన్నట్లు తన చేతిలో జగన్ ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని, తనకు బిజెపి కి చెడినందున జగన్ కు బిజెపి కి చెడినట్లేనన్నట్లుగా ఆయన ప్రచారం చేస్తున్నారని, దీని వల్ల జగన్ తీవ్ర నష్టం జరుగుతుందని వారు అంటున్నారు. మావాడి ని తన స్వార్థం కోసి కెసిఆర్ ఇరికిస్తున్నారని, గత ఎన్నికల్లో ఎంతో సహాయం చేసిన బిజెపి తో ఇప్పుడే తగాదా పెట్టుకోవాల్సిన పరిస్థితులు కెసిఆర్ సృష్టిస్తున్నారని, ఆయన మాయలో పడి మావోడు ఇబ్బందులు తెచ్చుకోబోతున్నారని వారు చెబుతున్నారు.నిన్న హైదరాబాద్‌లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో కేంద్రం పై ఇద్దరు ముఖ్యమంత్రులు ధ్వజమెత్తారని, కేంద్రం సహాయ నిరాకరణ చేస్తుందని, దీనిపై పోరాడాలని అనుకున్నట్లు వార్తలను కెసిఆర్ లీకులు చేశారని, దీని వెనుక ఆయన దురుద్దేశ్యాలను అర్థం చేసుకోవచ్చునని వారు అంటున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ ఎలా బయటకు వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. కావాలనే ఈ విధంగా ప్రచారం చేయడం వల్ల బిజెపి కి జగన్ కు మధ్య అగాథం పెరుగుతుందని, ఇదే కెసిఆర్ సృష్టిస్తున్నదేనంటున్నారు. తమిళనాడు ప్రతిపక్షనాయకుడు స్టాలిన్, దేవగౌడ, జగన్ లు తన వైపు ఉన్నారని, తనను బిజెపి ఏమీ చేయలేదని స్పష్టం చేయడానికే కెసిఆర్ ఇలా వ్యవహరిస్తున్నారంటున్నారు. తన స్వార్థం కోసం కెసిఆర్ జగన్ ను ఉచ్చులోకి లాగుతున్నారని, ఈ ఉచ్చులోకి జగన్ జారుకుంటున్నారని, దీని వల్ల ఎటువంటి అనర్థాలు వస్తాయో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. గత ఎన్నికల్లో బిజెపి చేసినట్లే, కెసిఆర్ కూడా సహాయం చేశారని, దానికి జగన్ బాగానే ప్రతిఫలం ముట్టచెబుతున్నారని, అయితే తన రాజకీయ స్వార్థం కోసం అనుభవం లేని జగన్ ను కెసిఆర్ ఎరగా వేస్తున్నారని దీనితో బిజెపి తో జగన్ సంబంధాలు రోజు రోజుకు క్షీణిస్తున్నాయంటున్నారు. కాగా కెసిఆర్ ఎత్తులను పసిగట్టిన జగన్ వ్యూహకమిటీ సభ్యులు దానికి విరుగుడు చర్యలు ప్రారంభించాయి. అయితే ఒకసారి కనుక అనుమానాలు మొదలయ్యాయంటే ఎంత దూరం పోతుందో చంద్రబాబు, బిజెపి సంబంధాల విషయంలో రుజువైందని, ఇప్పుడు అటువంటి పరిస్థితి తెచ్చుకోవడం అవసరమా ? అనే భావన జగన్ సన్నిహితుల్లో, ఆయనను అభిమానించేవారిలో వ్యక్తం అవుతోంది.
previous post