telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీలో మరో రెండు వారాలు కర్ఫ్యూ పొడగింపు ?

cm jagan

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా కర్ఫ్యూ పై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఈ నెల 31న సీఎం జగన్ సమీక్ష చేపట్టనున్నారు. ఈ సమీక్షలోనే కర్ఫ్యూపై నిర్ణయం తీసుకున్నారు సిఎం జగన్. అటు గత కొద్ది రోజులుగా ఉభయగోదావరి, చిత్తూరు జిల్లాలు మినహా రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని మినహాయింపులు ఇవ్వటమా లేక యథాతథ స్థితి కొనసాగించాలా అన్న అంశంపై సోమవారం నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. ఈ మేరకు సూచనలు ఇవ్వాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు సీఎం జగన్. కాగా ఏపీలో ఇప్పటికే ఏపీలో 16 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 84,502 శాంపిల్స్ పరీక్షించగా 14,429 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. 24 గంట‌ల్లోనే కోవిడ్‌తో 103 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇదే స‌మ‌యంలో 20,746 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,57,986 కి చేర‌గా.. యాక్టివ్ కేసులు 1,80,362 గా ఉన్నాయి.

Related posts