telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నెల్లూరు ఆయుర్వేదంపై సిఎం జగన్ సంచలన నిర్ణయం

cm jagan ycp

ఏపీలోని నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణ పట్నం లో ఉచితంగా ఇస్తున్న ఆయుర్వేద మందు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా నెల్లూరు ఆయుర్వేదంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు ఆయుర్వేదం మందుపై కేంద్రం ప్రభుత్వంలోని సంబంధిత విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలని సీఎం జగన్ ఆదేశించారు. దీంతో నెల్లూరుకు వెళ్ళనుంది ఐసీఎమ్మార్ బృందం. అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది ఐసీఎమ్మార్ టీం. అలాగే బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని… ఆక్సిజన్‌ సరఫరా పైపులు, మాస్క్‌లు ఇవన్నీ కూడా నిర్ణీత ప్రమాణాలున్న వాటినే వినియోగించాలని అధికారులకు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు సిఎం జగన్. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని..ప్రతి ఆస్పత్రి నుంచి నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులు, రెమ్‌డెసివర్‌ బ్లాక్ మార్కెట్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సిఎం జగన్. అక్రమాలకు పాల్పడిన ఆస్పత్రులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటెలిజెన్స్‌ అధికారులు బుక్‌ చేసిన కేసులపై చర్యలుండాలని సిఎం జగన్ పేర్కొన్నారు.

Related posts