telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీ నేత‌ కాల్వ శ్రీనివాసులు అరెస్ట్‌..

*టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అరెస్ట్‌
*రాయ‌దుర్గం వెళుతుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
*నిర‌స‌న‌గా రోడ్డుపై బైఠాయించిన కాల్వ శ్రీనివాసులు..
*పోలీసుల తీరుపై టీడీపీ నేత కాల్వ ఆగ్ర‌హం

ఆత్మకూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులును ఆత్మకూరు మండలం వడ్డుపల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రాయదుర్గం ప్రసన్న వెంకటరమణ స్వామి కళ్యాణోత్సవంలో జరిగిన జాప్యంపై తన మాటలను మరోసారి నిరూపించేందుకు మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు శనివారం ఉదయం11.30గంటలకు స్వామివారి గుడికి వెళ్లడానికి ప్రయత్నించారు.

ఈ సందర్భంగా ఆత్మకూరు మండలం, వడ్డుపల్లి వద్ద పోలీసులు రాయదుర్గం వెళ్లనీయకుండా కాల్వ శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నారు.

తనను అడ్డుకునే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని రోడ్డుపై బైఠాయించిన కాల్వ శ్రీనివాసులునిర‌స‌న వ్య‌క్తం చేశారు.  ఎందుకు అరెస్టు చేస్తున్నారో లిఖిత పూర్వకంగా రాసివ్వాలని కాల్వ‌ డిమాండ్ చేశారు.

Related posts