కర్వా చౌత్ వేడుకలలో పాల్గొన్నారు పలువురు సెలెబ్రిటీలు. ప్రస్తుతం వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సౌత్ ఇండియన్ స్టార్ అయినప్పటికీ ఈ పండుగను ఘనంగా జరుపుకున్నారు రానా. తన భార్య మిహీకతో కలిసి మొదటిసారి కర్వా చౌత్ ఫెస్టివల్‌లో భాగమయ్యారు. బుధవారం రోజు తన అత్తారింట్లో కర్వా చౌత్ పండుగ చేసుకున్న రానా.. భార్య మిహీకతో కలిసి ఫోటోలు దిగారు. తాజాగా ఈ పిక్స్ షేర్ షేర్ చేస్తూ మిహీక తల్లి బంటీ బజాజ్ ఇన్స్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. ఈ ఫొటోల్లో ఎరుపు రంగు చీర కట్టుకొని మ్యాచింగ్ బ్లౌజ్‌తో భర్త రానా కౌగిలిలో ఒదిగిపోయి కనిపిస్తోంది మిహీక. ఇలా ఈ నవదంపతులను చూసి మురిసిపోతున్న దగ్గుబాటి ఫ్యాన్స్ వారికి కర్వా చౌత్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా కర్వా చౌత్ అంటే దక్షిణ భారత దేశంలో అంతగా తెలియకపోయినా ఉత్తర భారత దేశంలో మాత్రం ఈ ఫెస్టివల్ అందరికీ సుపరిచితమే. ఈ పండుగ వేళ స్త్రీలు తమ భర్తల శ్రేయస్సు కోరుకుంటూ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి భర్త ఆశీర్వాదం తీసుకుంటారు.
previous post