telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కాకులు కూడా పగబడతాయా.. బయపడిపోతున్న యువకుడు..

crows attacking man for 3 years

కాకులలో కూడా ఐక్యత ఉంటుంది, మనషులలో మాత్రం కష్టమే. పొరపాటున ఒక కాకికి ఏదన్నా ప్రమాదం జరిగితే కాకులన్నీ ఏకమవుతాయి. కావు కావు మంటూ అరుస్తూ..తమ సంఘీభావాన్ని తెలుపుతాయి. మనషులు తెలిసో తెలీకో కాకికి హాని చేస్తే వారిపై ఏకథాటిగా దాడిచేస్తాయి. పొడిచి పొడిచి వేధిస్తాయి. అటువంటి కాకులు ఓ యువకుడిపై దారుణంగా దాడిచేస్తున్నాయి. ఇలా ఒకటీ రెండు రోజులు కాదు ఏకంగా మూడు సంవత్సరాల నుంచి అతను బైట కనిపిస్తే చాలు వెంటాడుతున్నాయి..వేధిస్తున్నాయి…ఇష్టమొచ్చినట్లుగా పొడుస్తున్నాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా బదర్‌వాస్ లో చోటుచేసుకుంది. అతని పేరు శివ. సుమైలా గ్రామానికి చెందిన శివ ఓ హోటల్ లో పనిచేస్తుంటాడు. అతడ్ని మూడు సంత్సరాల నుంచి కాకులు పొడిచి పొడిచి ఇబ్బంది పెడుతున్నాయి, వేధిస్తున్నాయి. బైటికి రావాలంటే శివ భయపడుతున్నాడు.

కాకుల దాడి నుంచి రక్షించుకోవటానికి కూడా ఓ కర్రను తెచ్చుకోవటం అతనికి మూడేళ్ల నుంచి అలవాటుగా మారిపోయింది. అతను కాకులకు హాని చేయలేదు..అనుకోకుండా జరిగిన ఓ ఘటనతో అతను కాకులకు బద్ధ శతృవుగా మారిపోయాడు.దీంతో కాకులు అతన్ని వెంటాడి పొడుస్తున్నాయి. మూడేళ్ల క్రితం శివ ఒక తోటకు వెళ్లాడు.అక్కడ ఒక కాకిపిల్ల పొదపడిపోయి ఉంది. దాన్ని చూసిన శివ దాన్ని రక్షించాలనుకున్నాడు. దగ్గరకెళ్లాడు. చేతుల్లోకి తీసుకున్నాడు. ఇలా కాకిపిల్లను కాపాడే ప్రయత్నంలో అది చనిపోయింది. అప్పటి నుంచి కాకులు తనను వెంటాడు బైటికి కూడా రానివ్వటంలేదునీ..రోడ్డు మీద నడవడం కూడా కష్టంగా మారిందని వాపోయాడు.

మొదట్లో కాకులు దాడి చేస్తుంటే అర్థంకాలేదని, తరువాత తాను చేసిన పని గుర్తుకు వచ్చిందని..తన చేతిలో కాకిపిల్ల చనిపోయన కారణంగానే తాను కాకులకు శత్రువును అయినట్టున్నానని తెలిపాడు. కాకులకు మిగిలిన పక్షల కన్నా గ్రహణశక్తి అధికంగా ఉంటుదని, ఇవి తమకు ఎవరు శత్రువులో, మిత్రులో ఇట్టే గ్రహిస్తాయని సైంటిస్టు చెబుతుంటారు. అవి పెట్టే గుడ్లు జోలికి ఎవరైనా వచ్చినా..వాటి పిల్లలకు ఎవరైనా హాని తలపెట్టినా అవి వెంటనే దాడి చేస్తాయని పలు పరిశోధనల్లో తేలింది. కాకులు గూళ్లు కట్టి గుడ్లు పెట్టిన సమయంలోను..అవి పిల్లలు అయినప్పుడు ఇటువంటి సందర్భాలు గ్రామాల్లో కనిపిస్తుంటాయి.

Related posts