ఐదు రాష్ట్రాల్లో కాలపరిమితి ముగుస్తున్న శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని 824 అసెంబ్లీ స్థానాలకు.. 16 రాష్ట్రాల్లోని 34 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రాల వారీగా ఎన్నికల వివరాలు చూసినట్లయితే… పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మార్చి 27 తొలి విడత, ఏప్రిల్ 1న రెండో విడత, ఏప్రిల్ 6న మూడో విడత, ఏప్రిల్ 10న నాల్గో విడత, ఏప్రిల్ 17న ఐదో విడత, ఏప్రిల్ 22న ఆరో విడత, ఏప్రిల్ 26న ఏడో విడత, ఏప్రిల్ 29న ఎనిమిదో విడత పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. అలాగే.. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 6న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇక అసోంలో మూడు దశల్లో పోలింగ్ జరుగనుంది. మార్చి 27న తొలి విడత, ఏప్రిల్ 1న రెండో విడత, ఏప్రిల్ 6న మూడో విడత పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 6న తిరుపతి ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బంది మొత్తానికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్నవారినే ఎన్నికల సిబ్బందిగా నియమిస్తామని స్పష్టం చేసింది సీఈసీ. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది సీఈసీ. ఇక ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడు అమల్లోకి వచ్చిందని.. మే 2న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని స్పష్టం చేసింది సీఈసీ.
previous post