telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నేడు న్యాయదేవతకు వస్త్రాపహరణం జరుగుతోంది : ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్ లో న్యాయ వ్యవస్థ ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది అని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. న్యాయముర్తులకు ఉద్దేశ్యాలు ఆపాదించరాదని రాజ్యాంగం స్పష్టంగా చెప్తున్నా దాడులు ఆగడం లేదు అని తెలిపారు. పార్లమెంట్ కు సైతం పరిమితులు ఉన్నాయి. నదిగం సురేష్, ఆమంచి కృష్ణ మోహన్, మరికొందరు కోర్టులను దూషించిన వారి జాబితాలో వున్నారు. సోషల్ మీడియా దుషణాలపై ఆరు నెలలుగా పిర్యాదులు చేస్తున్నా ప్రభుత్వం యెటువంటి చర్యలు తీసుకోలేదు అని పేర్కొన్నారు. వారికి ఇబ్బందికలిగించేలా వ్యాఖ్యలూ చేస్తే మాత్రం సెక్షన్ల పై సెక్షన్లు ఆరోపణల చేస్తూ కేసులు పెట్టీ అరెస్టులు చేశారు. కానీ ఇప్పుడు ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేని చేతకాని, నిస్సహాయ సిబిసిఐడి రాష్ట్రంలో ఉంది అని తెలిపారు. రాష్ట్రంలో మాతృభాషలోనే హత్య చేసే ప్రయత్నం జరుగుతోంది. అలనాడు కౌరవసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది.. నేడు న్యాయదేవతకు వస్త్రాపహరణం జరుగుతోంది అని చెప్పారు. నేటి అభినవ కౌరవసభలో నేనూ భాగస్వామిని ఐనందుకు సిగ్గుపడుతున్నా. వ్యవస్థలను వివస్త్రలను చేసే ప్రయత్నం ఎవరు చేసిన వారికి మనుగడ ఉండదు అని హెచ్చరించారు.

ఆనాడు ద్రౌపది ని గోవిందుడు కాపాడితే, నేడు న్యాయవ్యవస్థను కోవిందుడు ( రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్) కాపాడుతారు అని తెలిపారు. 300 రోజులుగా అమరావతి రైతులు నిరసన తెలుపుతుంటే సానుభూతి లేకపోగా అవమానిస్తున్నారు. ఉద్యమమే లేకపోతే అసెంబ్లీ కి వెళ్ళడానికి మీరెందుకు సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఉద్యమకారులంటే భయంతోనే సచివాలయంకి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాను. సజ్జల వంటి సలహాదారుల వల్ల మీరు ప్రజలకు దూరం అవుతున్నారు అని సూచించారు.

Related posts