telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కొబ్బరి నీళ్లతో నిమ్మకాయ తీసుకుంటే..!

మనం ఎండకాలం వస్తే ఎక్కువగా కొబ్బరి బొండ తాగుతాం. ఒక కొబ్బరి బోండంలో కనీసం 200 మీలి లేదా అంతకన్నా ఎక్కువ నీరు ఉంటుంది. ఇది లో క్యాలరీ డ్రింక్‌ కూడా… కొబ్బరి నీటిలో యాంటి ఆక్సిడెంట్‌, ఆమినో యాసిడ్‌, ఎంజైమ్స్‌, బీ కాంప్లెక్స్‌ విటమిన్‌, విటామిన్‌ సీ గుణాలు ఉంటాయి. కార్బోహైడ్రైట్స్‌కు మంచి సోర్స్‌ ఇది. శక్తిని పెంచుతుంది. ఈ కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్‌ అధికంగా ఉంటాయి. శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉదర సంబంధిత రోగాలను నివారిస్తుంది. కొబ్బరినీటిలో నిమ్మకాయ రసం కలిపి తాగడం వల్ల డీ హైడ్రేషన్‌ తొలుగుతుంది. ఉదయం వర్కవుట్‌ తర్వాత కొబ్బరి నీరు తాగడం మంచిది. ఇందులో చాలా తక్కువ శాతం కేలరీస్‌ ఉంటాయి. బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. కొబ్బరి నీరు తాగడం వల్ల హైబీపీ కూడా అదుపులోకి వస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌ సీ, పోటాషియం, మెగ్నీషీయం బ్లడ్‌ ప్రెషర్‌ను అదుపు చేస్తుంది. అంతేకాదు.. బాగా తలనొప్పిగా ఉన్నా.. లేదా మైగ్రేయిన్‌ ఉన్నా కొబ్బరి నీరు తాగండి. ఎందుకంటే డీ హైడ్రేషన్‌ వల్ల తలనొప్పి వస్తుంది. కొబ్బరి నీటి వల్ల శరీరం హైడ్రేట్‌ అవుతుంది. ఇందులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. చాలా మందిలో మెగ్నీషియం లోపించడం వల్లే తలనొప్పి మైగ్రేషన్‌ వస్తుంది. కొబ్బరి నీటితో మెగ్నీషియం శరీరానికి చేరుతుంది.

Related posts