telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేజీఎఫ్-2 : అధీరా లుక్ వెనుక అసలు కథ…!!

KGF-2

2018లో విడుదలైన “కేజీఎఫ్” సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. కన్నడ స్టార్ హీరో యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అక్రమ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్ గా ప్రస్తుతం “కేజీఎఫ్ 2” రానుంది. ఇందులో కూడా ప్రధాన పాత్రలో యశ్, హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నెగెటివ్ పాత్ర పోషిస్తున్నాడు. అధీరా లుక్ ని ఇటీవల సంజయ్ దత్ పుట్టినరోజు కానుకగా చిత్ర బృందం విడుదల చేశారు. ఇక విలన్ గా అధీరా లుక్ ఓ రేంజ్ లో ఉంది. ముఖంపై టాటూలు, పెద్ద జడతో సంజయ్ లుక్ ఆసక్తి రేపింది. ఆయన లుక్ చూసిన తరువాత కెజిఎఫ్2 లో ఆయన పాత్ర చాలా క్రూరంగా ఉంటుందని అనిపిస్తుంది. ఐతే అధీరా లుక్ వైకింగ్స్ స్పూర్తితో డిజైన్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు. కాగా ఈ లుక్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలియజేశారు. అధీరాను చూస్తే ఎవరైనా భయపడాలి అనేది, ప్రశాంత్ నీల్ కాన్సెప్ట్ అట. అందుకే ఆయన లుక్ కి వైకింగ్స్ లుక్ స్ఫూర్తిగా తీసుకున్నారట. ఇక ఆ మేకప్ వేయడానికి కూడా గంటల సమయం పట్టేదట. గంటల తరబడి ఓపికగా కూర్చోని మేకప్ వేయించుకునేవారట సంజయ్ దత్. ఇక హీరో యష్ నటిస్తున్న ఈ మూవీని అక్టోబర్ 23న విడుదల చేయనున్నారు.

Related posts