telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

అరకులో 14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్

araku vishakha

ఏపీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు. 14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించారు. అరకు లోయలో ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించారు.

అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో జరిగిన గిరిజన, వ్యాపార, జేఏసీ, ఇతర సంఘాల సమావేశంలో అరకు లోయలో కరోనా కేసుల తీవ్రతపై చర్చించారు. ఆ తర్వాత 14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని తీర్మానం చేశారు. గత రెండు రోజులుగా అరకు లోయలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కట్టడి చర్యలకు తీర్మానం చేశారు.

Related posts