telugu navyamedia
రాజకీయ

చీర క‌ట్టుతో చ‌రిత్ర సృష్టించిన తొలి మ‌హిళా ఫైలెట్‌..!

భారతదేశంలో చీర కట్టుకుని విమానం నడిపిన భారత తొలి మహిళా పైలెట్ సరళ తక్రల్ ..ఈమె 1914లో అప్పటి బ్రిటిష్ ఇండియాలో జన్మించారు. 16 ఏళ్ల వయసులో ఆమెకి పెళ్లైంది. ఆమె భర్త పి.డి శ‌ర్మ ఒక పైలెట్‌. ఆయన స్ఫూర్తితోనే ఫైలట్ శిక్షణ తీసుకుంది. ఆమె కుటుంబంలో మొత్తం తొమ్మిది మంది పైలట్లు ఉన్నారు.

ఆమె 1936 లో మొదటిసారిగా రెండు రెక్కల చిన్న విమానాన్ని నడిపినప్పుడు చరిత్ర సృష్టించింది. నాలుగేళ్ల పాప ఉండగానే.. 21 ఏళ్ల వయసులో సంప్రదాయ చీర కట్టులో విమానం నడిపి ఏ గ్రేడ్‌ లైసెన్స్‌ దక్కించుకుంది. లాహోర్‌ ఫ్లైయింగ్‌ క్లబ్‌ తరపున ఈ ఘనత సాధించాక.. కమర్షియల్‌ పైలెట్‌ శిక్షణ కోసం జోధ్‌పూర్‌ వెళ్లింది.

అయితే 1939లో విమాన ప్రమాదంలో ఆమె భర్త చనిపోవడం, ఆమె జీవితంలో కోలుకోలేని స్థితికి చేరుకుంది. ఆ త‌రువాత‌ రెండో ప్రపంచ యుద్ధం రావడంతో కమర్షియల్‌ పైలెట్‌ కావాలనే కల తీర‌లేదు. ఆపై లాహోర్‌కు వెళ్లి ఫైన్‌ ఆర్ట్స్‌, పెయింటింగ్‌ కోర్సులు చేసింది. 1947 లో విభజన తర్వాత ఆమె భారతదేశానికి త‌న ఇద్ద‌రు కూమార్తెల‌తో వచ్చి ఆభరణాల డిజైనింగ్‌, బట్టల డిజైనింగ్ పెయింటింగ్ పనిని కొనసాగించింది . సొంత వ్యాపారంతో బిజినెస్ మ‌హిళ‌గా పెద్ద సక్సెస్ అందుకుంది. సరళ తక్రల్ 91 వ‌య‌స్సు (2008) ఆనారోగ్యంతో కన్నుమూసింది.

‘వైమానిక రంగంలో మహిళల ప్రవేశానికి స్ఫూర్తినిస్తూ చరిత్రలో ఆమె ఒక చెరగని ముద్ర వేశారు. అందుకే ఈసారి ఆమె మీద గౌరవార్థం ఈరోజు 107వ పుట్టినరోజు సందర్భంగా డూడుల్‌తో నివాళులర్పించింది.

 

Related posts