బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ బీట్రెస్ వివాహం నిన్న ఇటలీకి చెందిన వ్యాపారవేత్త ఎడోర్డో మేపిలీ మోజీతో నిరాడంబరంగా జరిగింది. బీట్రెస్ వయసు 31 సంవత్సరాలు కాగా, మొజ్జిని వయసు 37 సంవత్సరాలు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీరి పెళ్లి అతి కొద్దిమంది అతిథుల మధ్య సాదాసీదాగా జరిగింది.ఈ విషయాన్ని కింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి.
కొత్త జంటకు పలువురు రాజ వంశీయులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారని పేర్కొంది. కాగా, వీరిద్దరి వివాహం మే 29న లండన్, సెయింట్ జేమ్స్ ప్యాలెస్ లో జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలోఅప్పట్లో వారి వివాహం వాయిదా పడింది. దాని తరువాత, మరో తేదీని నిర్ణయించిన పెద్దలు వివాహాన్ని రాయల్ చాపెల్ ఆఫ్ ఆల్ సెయింట్స్ వద్ద నిర్వహించారని రాజ కుటుంబం వెల్లడించింది.
వైసీపీని బీజేపీలో విలీనం చేయటం ఖాయం: గల్లా జయదేవ్