telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలి.. అధికారులకు సూచించిన జగన్

ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. స్పందన రివ్యూలో ఆయా శాఖల అధికారులతో నూతన ఇసుకపాలసీపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే చూడలేక బాధపడేవాళ్లు ఇలాంటి చర్యలకు దిగజారుతున్నారని విమర్శించారు. అలాంటి వారి కుట్రలను చేధించాలని అధికారులను ఆదేశించారు. సెప్లెంబర్ 5న నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేట్లు కన్నా తక్కువ రేట్లకు ఇసుకను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఇసుక సరఫరా పెంచాలని లేకపోతే రేట్లు తగ్గే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికే గుర్తించిన స్టాక్ యార్డుల్లో ఇసుకను నింపడం మెుదలుపెట్టాలని సూచించారు. అవకాకాశం ఉన్న ప్రతిచోటా రీచ్‌లను ఏర్పాటు చేయాలన సూచించారు. వరదల వల్ల కొత్త రీచ్‌లు పెట్టే అవకాశం వచ్చిందని అధికారులు చెప్పడంతో ప్రకృతికి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వీలున్నచోట కొత్త రీచ్ లు తీసుకురండి అంటూ సూచించారు. రవాణాలో ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. ఇసుకరీచ్ లను ఎక్కువ మందికి ఇవ్వాలని ఆదేశించారు. ఇసుక సరఫరా అంశంలో ఎవరూ తప్పులు చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Related posts