చెన్నై సూపర్ కింగ్స్‌తో నిన్న జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై పై ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఓడింది. అయితే ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ‘ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. నా స్లో బ్యాటింగే జట్టు ఓటమికి కారణమైంది. నేను ఫీల్డర్స్ చేతుల్లోకి షాట్లు ఆడాను. మరోవైపు మనీష్ పాండే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేన్ విలియమ్సన్, కేదార్ జాదవ్ ధాటైన ఇన్నింగ్స్‌లతో మాకు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మాకు ఓటమి తప్పలేదు. దీనికి పూర్తి బాధ్యత నాదే. వాస్తవానికి నేను ఆడిన ఓ 15 సూపర్ షాట్స్‌ను ఫీల్డర్లు అద్భుతంగా అడ్డుకున్నారు. దాంతో నేను అసహనానికి గురయ్యాను. ఎక్కువ బాల్స్ ఆడాల్సి వచ్చింది. 170 పరుగులు మంచి స్కోరే. కానీ పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోయాం. దాంతో కమ్ బ్యాక్ చేయలేకపోయాం. ఇలాంటి వికెట్స్‌పై పవర్ ప్లే సహకారం లేకుండా గేమ్‌లో నిలవడం చాలా కష్టం. చెన్నై ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆఖరి వరకు మేం పోరాడాం. ఆరంభంలోనే వికెట్లు తీసుంటే కలిసొచ్చేది. కానీ గేమ్‌లో ఆద్యాంతం వాళ్లు మాపై ఆధిపత్యం చెలాయించారు అని అన్నారు.
previous post
ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు: మంత్రి బొత్స