telugu navyamedia
క్రీడలు వార్తలు

ఈ ఏడాది రాహల్ చెలరేగుతాడు…

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్న విషయం తెలిసిందే. కానీ అతను కాస్త నెమ్మదిగా ఆడటంతో కొందరు విమర్శించారు. కానీ అతను నెమ్మదిగా ఆడటానికి గల కారణాన్ని వివరించాడు. ‘గతేడాది రాహుల్‌ కాస్త నెమ్మదిగా ఆడాడు. ఐదో నంబర్‌ తర్వాత బ్యాటర్లు లేకపోవడం, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఫామ్‌లేమితో చివరి వరకు బ్యాటింగ్‌ చేశాడు. అప్పగించిన పనిని పూర్తి చేసే బాధ్యతను అతడే తీసుకున్నాడు. కానీ ఈసారి దూకుడైన రాహుల్‌ను చూస్తారు’ అని జాఫర్‌ స్పష్టం చేశాడు. ఎక్కువ మ్యాచులు ఆడేకొద్దీ మరింత మెరుగవుతారని వెల్లడించాడు. గత సీజన్‌లో మిడిలార్డర్ బలహీనంగా ఉండటంతో రాహుల్ కాస్త నెమ్మదిగా ఆడాడని, కానీ ఈ సారి టీమ్ బ్యాలెన్సంగా ఉండటంతో అతను స్వేచ్చగా చెలరేగుతాడని… ఈ సీజన్‌లో కేఎల్ రాహుల్ పరుగుల విధ్వంసం చూస్తారని వసీమ్ జాఫర్ అన్నాడు.

Related posts