telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్ పై ఇంగ్లడ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవదు : ఇంగ్లడ్ స్పిన్నర్

టెస్ట్ ఛాంపియన్‌షితో సహా ఆపై జరిగే ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా విజయం సాధిస్తుందని ఇంగ్లీష్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ జోస్యం చెప్పాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టులను కూడా భారత్ గెలుస్తుందన్నాడు. జూన్ 2న ఇంగ్లండ్ గడ్డపైకి వెళ్లనున్న విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత టెస్టు జట్టు.. అక్కడ సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి 23 వరకూ ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌లో తలపడనుంది. ఆపై నెల రోజుల విరామం భారత జట్టుకు దొరుకుతుంది. ఆ సమయంలో ఇంగ్లండ్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుంది. ఇక ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌‌లో భారత్ ఢీకొట్టబోతోంది. టెస్టుల్లో ఇటీవలి కాలంలో అద్భుత ఫామ్ కనబర్చుతున్న కోహ్లీసేన.. ఇంగ్లండ్ గడ్డపై కూడా అదే పునరావృతం చేయాలని భావిస్తోంది. ‘ఆగస్టులో ఇంగ్లండ్ పిచ్‌ల నుంచి బాగా టర్న్ లభిస్తుంటుంది. అదే జరిగితే.. ఇంగ్లండ్‌ని ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేస్తుంది. ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌లో కెప్టెన్ జో రూట్ మినహా ఎవరూ స్పిన్‌‌ని సమర్థంగా ఎదుర్కోలేరు. రూట్ మాత్రం ఎప్పుడూ పరుగులూ చేయలేడు కదా. ఒక్కసారి భారత స్పిన్నర్లకి ఈ విషయం అర్థమైతే.. సిరీస్‌ ఏకపక్షం అయిపోతుంది. 5-0తో భారత్ టెస్ట్ సిరీస్ గెలవొచ్చు. న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్‌ గ్రీన్ పిచ్‌పై జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ టీమిండియానే ఫేవరెట్. ఎందుకంటే.. అన్ని విభాగాల్లో కోహ్లీసేన పటిష్టంగా ఉంది’ అని మాంటీ పనేసర్ చెప్పుకొచ్చాడు.

Related posts