మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నతాజా చిత్రం ‘ఆచార్యస. ఇందులో రామ్‌చరణ్ సిధ్ధ అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. చీరంజీవి జతగా కాజల్, రామ్‌చరణ్‌కు జతగా పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని దర్శకుడు కొరటాల తనదైన మార్క్ టేకింగ్‌తో ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దినట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.
అయితే ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది.
దీంతో మెగాఫ్యాన్స్, మహేశ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ‘మెగాసూపర్ ట్రీట్’ అంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు.
కాగా.. ఈ మూవీ విషయానికొస్తే..ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి లు ఇద్దరూ కలిసి నటించిన చిత్రం కావడం, ఇద్దరినీ కూడా మాస్ అండ్ పవర్ఫుల్ గా చూపించడంతో మెగా ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి