telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఛపాక్” ట్రైలర్… భావోద్వేగానికి లోనైన దీపికా…!

Chapaak

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ ప్రధాన పాత్రలో నటించిన బయోపిక్ “ఛపాక్”. ఆ బయోపిక్ ఎవరిదంటే ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ అనే అమ్మాయిది. పెళ్లి తర్వాత దీపిక నటించిన మొదటి సినిమా ఇది. మేఘనా గుల్జార్ డైరెక్ట్ చేశారు. విక్రాంత్ మస్సే దీపిక ప్రియుడి పాత్రలో నటించారు. ఇందులో ఆమె యాసిడ్ దాడి బాధితురాలి పాత్రలో నటించారు. దిల్లీకి చెందిన లక్ష్మీ అగర్వాల్ అనే యువతిపై 2005లో యాసిడ్ దాడి జరిగింది. యావత్ భారతదేశం ఈ దాడితో దద్దరిల్లింది. యాసిడ్ దాడి జరిగినప్పుడు లక్ష్మి వయసు పదిహేనేళ్లు. ప్రేమించమంటూ వెంటపడిన ఓ కుర్రాడు లక్ష్మిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కోలుకున్న లక్ష్మి దేశంలో యాసిడ్ అమ్మకాలు ఆపాలంటూ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈమె జీవితాధారంగానే ‘ఛపాక్’ సినిమాను తెరకెక్కించారు. అయితే రేప్, యాసిడ్ దాడి బాధితురాళ్ల పేర్లు బయటికి చెప్పకూడదన్న నిబంధన ఉన్నందుకు సినిమాలో దీపిక పేరును మాలతి అని పెట్టారు. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్‌లో దీపిక నటన ఏడిపించేసింది. ఇందులో ఆమె పాత్ర పేరు మాలతి. యాసిడ్ దాడికి గురైనప్పుడు పడే బాధ ఎలా ఉంటుందో ఆమె కళ్లకు కట్టినట్లు చూపించింది. దాదాపు 50 ప్లాస్టిక్ సర్జరీలు చేశాక మాలతి ముఖం కాస్త చూసే విధంగా మారుతుంది. అది ఆమెలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. ‘ఛపాక్’ ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నప్పుడు దీపిక కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి కథలు మన ముందుకు తరచూ రావు. ఓ డైరెక్టర్ వచ్చి స్క్రిప్ట్ వివరిస్తే ఓకే చెప్పే కథ కాదు ఇది. ఎమోషనల్‌గా ఈ కథకు కనెక్ట్ అయ్యాను కాబట్టే నిర్మించడానికి కూడా ఒప్పుకున్నాను. ఈ సినిమా ప్రభావం మన అందరిపై ఉంటుంది. కనీసం ఈ సినిమా చూశాకైనా ప్రజల్లో అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు. 2020 జనవరి 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts