telugu navyamedia
సామాజిక

పిల్ల‌లు భ‌విష్య‌త్ పై విస్తు పోయే నిజాలు..

అదొక చిన్న టౌన్ . హైదరాబాద్ లాంటి విశ్వ నగరం కాదు . వైజాగ్ , విజయవాడ , వరంగల్ , కరీంనగర్ లాంటి పెద్ద నగరం కూడా కాదు . చాలా చిన్న టౌన్ .

అక్కడొక విద్యార్ధి డ్రగ్స్ తో పట్టుపడ్డాడు . తీగె లాగితే… వాడికి ఇంటర్ చదువుతున్న విద్యార్ధి దాన్ని ఇచ్చాడని తేలింది . ఆ ఇంటర్ విద్యార్థికి మరో విద్యార్ధి ఇచ్చాడు . ఇంకా లోతుకు వెళితే… అక్కడ ఒక సప్లై చైన్ ఉందని తేలింది .

ఇప్పుడు మీరు ఆ టౌన్ ఏదని?’ నాకు ఈ సమాచారం ఎలా వచ్చిందని ఆలోచిస్తూ ఉండవచ్చు . సమస్య అది కాదు . డ్రగ్స్ సప్లై చేసే నెట్ వర్క్ చిన్న టౌన్స్ , పెద్ద గ్రామాల దాక ఎలా వ్యవస్తీకృతం అయ్యింది అని చెప్పడానికి ఇదొక కేసు స్టడీ .

మన అబ్బాయి స్కూల్ కు వెళుతున్నాడు అని తల్లితండ్రులు అనుకొంటారు . విద్యార్థుల్లో నెట్ వర్క్ ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ ముఠా లు చెలరేగి పోతున్నాయి . ముందుగా ఒక్కడు .. వాడి నుంచి ముగ్గురు .. ఇది ఇలా స్ప్రెడ్ అయిపోతుంది . పిల్లల చేతిలో సెల్ ఫోన్ . వారి నెట్ వర్క్ వారిది . ఒక్క సారి ఈ ఊబిలోకి వెళితే అది చివరకు క్రైమ్ బాట పడుతుంది .

 

ముందుగా నాన్న జేబులో తెలియకుండా డబ్బు కొట్టేయడం .. సంవత్సరం లో దొంగతనం .. అవసరం అయితే హత్య. బాల క్రిమినల్స్ తయారీకి రంగం సిద్ధం . చదువు సర్వ నాశనం … అంతేనా? .. ఆరోగ్యం .. మొత్తం కుటుంబం భవిష్యత్తు నాశనం .

చెబితే పరువు పోతుందని స్కూల్స్ దాచేస్తాయి . తల్లితండ్రికి ఒక దశ వరకు తెలియదు . తెలిసాక వారు చేసేది ఏమీ ఉండదు . విద్యార్థుల స్థాయి కి డ్రగ్స్ వెళ్ళిపోతే పోలీస్ లు చేసేది కూడా పెద్దగా ఏమీ ఉండదు .

How Drug Abuse Starts And Prevention - San Diego | API

నాకొక సంఘటన గుర్తొస్తోంది . 2020 ఆగష్టు – సెప్టెంబర్ అనుకొంటా.. అయ్యా .. “స్కూల్ మూసి ఉంచింది చాలు .. పిల్లలకు కరోనా వల్ల ముప్పు లేదు .. నిజానికి స్కూల్ తెరిస్తే పంపడానికి కనీసం కొంత మంది పేరెంట్స్ సిద్ధంగా వున్నారు . మేము మా స్లేట్ విజయవాడ తల్లితండ్రుల్లో సర్వే చేసాము .. నలబై శాతం తల్లి తండ్రులు స్కూల్ తెరిస్తే పంపడానికి సిద్ధంగా వున్నారని చెప్పారు ” అని ఒక పోస్ట్ పెట్టా.

అంతే ఒక వీర నారీమణి నా పై దాడి చేసింది . ” నీ స్కూల్ నడవాలని నువ్వు జనాల్ని తప్పు దారి పట్టిస్తున్నావు . స్కూల్స్ తెరిచి ఏ బిడ్డకైనా ఏదైనా అయితే నువ్వు బాధ్యత వహిస్తావా ? నీది తప్పు సర్వే. ఫేక్ సర్వే ల తో జనాల్ని మోసం చేస్తున్నావు ” ..అని వీర కామెంట్

” వామ్మో ..మహా తల్లే .. ఎంత మాట చెప్పావు ? . తప్పు సర్వే ఏంటి తల్లి ? మేము ఫోన్ చేసి అడిగితే” ఎస్ పంపిస్తాము అని చెప్పిన తల్లితండ్రుల శాతం .. కేవలం ఒక కేసు స్టడీ గా చెప్పాను. అందువల్ల నాకొచ్చిన పర్సనల్ బెనిఫిట్ ఏంటో ? వంద సార్లు చెప్పా .. మా ఆన్లైన్ బ్రహ్మాండంగా నడుస్తుంది . యాభై ఏళ్లయినా నడపగలం . నా బాధ .. నా గురించి .. నా స్కూల్ నడవడం గురించి కాదు .. పిల్లలు భౌతిక తరగతులకు దూరం అయితే జరిగే నష్టం గురించి అని ..

Online classes - effects health of students - OIB News

తమాషా ఏమిటంటే నా పై దాడి చేసిన వీర మహిళ.. మా స్కూల్ పేరెంట్ కాదు . కనీసం నా ఫేస్బుక్ ఫ్రెండ్ కాదు .. ఫాలోవర్ కాదు . కామన్ ఫ్రెండ్ ఒకరు కామెంట్ చేసాడు . నా పోస్ట్ ఆమెకు కనిపించించి ఉంటుంది . వచ్చింది .. తన పైత్యాన్ని నా పై వెళ్ళకక్కి పోయింది . ఇది జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే .

.. మేధావులు .. విజ్ఞులు ఎంతో మంది .. ఎన్నో సార్లు .. “జీరో అకాడమిక్ ఇయర్ .. పరీక్షలు రద్దు చెయ్యాలి .. చదువు కన్నా ప్రాణం గొప్ప” అని స్టేట్మెంట్ లు ఇచ్చిన వారు ఏ కలుగు లో దాగి వున్నారో ?

కరోనా వల్ల ఒక బిడ్డ ప్రాణం కూడా పోలేదు . స్టే హోమ్ వల్ల… తాగుడు .. గంజాయి .. చరస్ .. హుక్కా .. నీలి చిత్రాలు . హింసాత్మక వీడియోలు .. చేతిలో కత్తులు .. ఇది కాకుండా సూది మందు వేసుకొని గుండె సమస్యలు .. పదమూడు ఏళ్లకు గుండె ఆపరేషన్ .

కరోనా మూడో వెవ్ పిల్లలని టార్గెట్ చేయనుంది అని హంగామా సృష్టించి .. పిల్లల ఆసుపత్రుల్లో బెడ్స్ సిద్ధం చేసిన దౌర్భాగ్య వ్యవస్థ మనది . పిల్లల కరోనా వచ్చిందా ? .. కరోనా కాదు .. పిల్లల పాలిట సరికొత్త మాయరోగం వచ్చింది . ఏంటంటారా ? ఇప్పుడు ఏ మానసిక వైద్యుడి దగ్గరకైనా వెళ్ళండి .. పదుల సంఖ్యలో బాల మానసిక రోగులు కనిపిస్తారు . మందులు తిన్నా గుణం కనిపించడం లేదు .

ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో యాభై శాతం ఫెయిల్ .. వేల సంఖ్యలో సున్నా మార్కుల విద్యార్థులు … ప్రభుతాన్ని భయపెట్టి అందరినీ పాస్ చేయించారు . ఇప్పుడు అదే విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ లో .. జీవితం లో ఇప్పటిదాకా వీరు పరీక్షలు రాసింది లేదు . అన్నీ కరోనా పాస్ లు . సరిగ్గా పరీక్ష పెడితే కనీసం ఇరవై శాతం కూడా పాస్ కారు . డ్రగ్స్ , నీలి చిత్రాల సరఫరా దారులుగా వీరిలో కొంత మంది స్వయం ఉపాధి వెదుక్కొనే స్థితి .

మాస్క్ పెట్టుకో .. పూసుకో .. రాసుకో అంటూ ముక్కు పచ్చలారని పిల్లలని భయపెట్టేసారు . అదీ ఒక వారం కాదు . నెల కాదు .. రెండేళ్లు . కరోనా మొదలయ్యే టప్పటికి సంవత్సరం లోపు ఉన్న పిల్లలు .. ముఖ్యంగా నగరాల్లో పెరిగిన పిలల్లు మానసిక వికలాంగులయ్యారు .ఒక నగరం లో పిల్లల పై జరిగిన సర్వే లో పిల్లల ఐ క్యూ లెవెల్స్ ఇరవై శాతం పడి పొయ్యాయి అని తేలింది .

మొన్న స్కూల్ అడ్మిషన్ కోసం ఒక పేరెంట్ వచ్చాడు . కరోనా మొదలయ్యేటప్పటికీ ఆ అబ్బాయి వయసు మూడేళ్లు . అప్పటికి మాటలు వచ్చేవి. అబ్బాయి ఆరోగ్యంగా ఉండేవాడు . . అమ్మ నాన్న ఇద్దరు వర్క్ ఫ్రొం హోమ్ .. కంప్యూటర్ పై బిజీ .. ఉండేది దుబాయ్ లో { ఇప్పుడు ఇండియా కు వచ్చారు } . పిల్లాడితో మాట్లాడడానికి ఎవరూ లేదు . ఆటలు లేవు .. పాటలు లేవు .చేతిలో సెల్ ఫోన్ . ఇప్పుడు ఆ అబ్బాయి .. పూర్తి స్థాయి మానసిక రోగి .. మాటలు రావు .. గట్టిగ అరుస్తాడు .. ఒక చోట ఒక్క నిముషం కూర్చోడు . వస్తువును తీసి విచక్షణా రహితంగా విసురుతాడు . అది నీ మొఖానికి తగిలితే కన్ను పోవచ్చు .. తలపగలొచ్చు .

ఒక మంచి స్కూల్ లో సీట్ దొరికితే , వారు శ్రద్ధ పెడితే అబ్బాయి మెల్ల మెల్లగా దారిలో పడుతారని దుబాయ్ మానసిక వైద్యులు చెప్పారట . వెదుక్కొంటూ ఆ తల్లితండ్రులు వచ్చారు . ఇప్పుడు సీట్ ఇస్తే .. రేపు జూన్ జులై లో క్లాసులో ఆ అబ్బాయ్ ఏదైనా ఒక వస్తువు తీసి పక్కన ఉన్న మరో బిడ్డ తలపగలకొడితే ? టీచర్ ఎంత సేపు ఒక బిడ్డ ను చూసుకోలేదు కదా ? ఒక క్షణం అదమరిస్తే . బ్లాక్ బోర్డ్ వైవు తిరిగినప్పుడు ఏదైనా జరిగితే .. “స్కూల్ అశ్రద్ధ .. ఘోరం” అని ప్రచారం అయిపోతుంది . ఎవడో మంట పెట్టాడు . దాన్ని ఆర్పాల్సిన భాద్యత మాదా? అప్పుడు నిందలు మాకే.. ఇప్పుడు సమస్యలు పరిష్కరించాల్సిన భాద్యత మాకే .

ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అని అనుకొంటున్నారా ? స్కూల్స్ మూసేసే ప్రయత్నం మళ్ళ్లీ మొదలయ్యింది . మూడు లక్షల కేసులు ఉన్న జర్మనీ లాంటి దేశాల్లో స్కూల్స్ నడుస్తున్నాయి . వెయ్యి దొంగ కేసులు వచ్చాయి .. ఢిల్లీ ప్రభుత్వం స్కూల్స్ మూసేయాలా అని నిన్న మీటింగ్ పెట్టింది . ప్రస్తుతానికైతే మోయడం లేదు అన్నారు . అంతా నాటకం . వారం పది రోజులకు కేసులు కాస్త పెరిగితే మూసేస్తారు .

ఆన్లైన్ ఎడ్యు కంపెనీ లు .. గోతికాడ నక్కల్లా కాచుకొని కూర్చొన్నాయి . ఢిల్లీ వేదిక గా తిరిగి పాఠశాలల్ని మూసెయ్యాలని ప్రయత్నం .. వీరికి అమ్ముడు పోయిన మీడియా సహకారం ఎలాగూ ఉంటుంది . ఇంకో సారి పాఠశాల మూసేస్తే ? ఊహించడానికి కూడా భయంగా వుంది . నా భయం నా స్కూల్ నడపడం గురించి కాదు . అసలు స్కూల్ ఎందుకు నడపాలి .. ఇవన్నీ ఎందుకు పట్టించుకోవాలి .. సర్వం .. సర్వ నాశనం దారిలో వెళుతున్నప్పుడు మనం ఏదో ఎడ్యుకేట్ చేయబోయి నిందలు పడాలా ? అయినా ఎంత కాలం?” ఇదీ నా మనసులోని వేదన .

పిల్లల భవిష్యత్తు సర్వ నాశనం అవుతుంటే మాట్లాడే వాడు లేడు. పైగా ఆన్లైన్ ఎడ్యు కంపెనీ లు.. కంప్యూటర్ హార్డ్ వెర్ తయారీ దారులు .. సాఫ్ట్ వెర్ కంపనీ యాజమాన్యాలు .. మెడికల్ మాఫియా .. ఇదే అవకాశం అని కాచుకొని కూర్చున్నాయి . రాజకీయ పార్టీలకు ఇదేదీ అజెండా కాదు . కనీసం ఒక్క నాయకుడు .. ఒక పార్టీ కూడా దీని గురించి మాట్లాడదు.

రచయిత ..

వాసిరెడ్డి అమర్‌నాథ్

Related posts