మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల కానుంది.
ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమురంభీమ్‌గా కనిపించనున్నారు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆలియాభట్, శ్రియ, అజయ్‌దేవ్‌గణ్, ఒలీవియా మోరీస్, సముద్రఖని కీలకపాత్రల్లో సందడి చేయనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా విడుదల రాజమౌళి సన్నాహాలను ముమ్మరం చేశాడు. మూవీ ట్రైలర్‌ను కూడా డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. అయితే.. ఇండియాలో కాకుండా కేవలం ఓవర్సిస్లో కూడా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని రాజమౌళి సహా చిత్ర బృందం భావిస్తోందట.
అమెరికాలోనే 1000 మల్టీప్లెక్స్‌ల్లో సినిమా రిలీజ్ చేయడమే లక్ష్యంగా చిత్ర యూనిట్ పనిచేస్తున్నట్లు సమాచారం. బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కావడంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఊన్నాయి. సరిగమ సినిమా, రఫ్టర్ క్రియేషన్స్ ఈ సినిమాను అమెరికాలో పంపిణీ చేస్తున్నాయి. కీరవాణి స్వరాలు అందించారు.
ఏపీ మెజారిటీ ప్రజలు రోడ్ల మీదకు వస్తే హైదరాబాద్ పరిస్థితేంటి: శివాజీ