telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా బారిన పడిన మ‌రో కేంద్ర‌మంత్రి…

Ramesh Phokriyal

దేశంలో కరోనా కేసులు సంఖ్య రోజుకు వేలలో పెరుగుతూ పోతుంది. వారు వీరు అనే తేడా లేకుండా అందరిని తన చెంతన చేర్చుకుంటుంది కరోనా. దాంతో క్ర‌మంగా వైర‌స్ బారిన ప‌డుతోన్న సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటు వీవీఐపీల సంఖ్య కూడా పెరిగిపోతోంది.. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల సీఎంలు, ప‌లువురు కేంద్ర మంత్రులు, ఇత‌ర ప్ర‌ముఖులు కోవిడ్ భారిన ప‌డ‌గా..  తాజాగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ నిషాంక్ కు కూడా కోవిడ్ సోకింది.. ఆయ‌న వ‌య‌స్సు 61 సంవ‌త్స‌రాలు.. త‌న‌కు క‌రోనా వ‌చ్చిందంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌నే వెల్ల‌డించారు.. ఈ రోజు చేయించుకున్న క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో త‌న‌కు పాజిటివ్‌గా తేలింద‌ని. డాక్ట‌ర్ల సూచ‌న‌ల‌తో నేను చికిత్స తీసుకుంటూ, మెడిసిన్ వాడుతున్నాన‌ని.. ఇటీవ‌లి కాలంలో త‌న‌ను క‌లిసిన అధికారులు, మిత్రులు అంతా కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ట్వీట్ చేశారు. అయితే ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ కూడా వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

Related posts