telugu navyamedia
క్రీడలు వార్తలు

బుమ్రా ఎక్కువ కాలం ఆడుతాడా లేదా అనేది చెప్పడం కష్టం…

బుమ్రా ఎక్కువ కాలం క్రికెట్ ఆడుతాడో లేదో చెప్పడం కష్టమేనన్నాడు న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ రిచర్డ్ హెడ్లీ . అయితే ఆ విభిన్న బౌలింగ్ టెక్నికే బుమ్రా అసాధారణ బౌలర్‌గా నిలబెట్టిందని ప్రశంసించాడు. జూన్​ 18-22వరకు కివీస్​, భారత జట్టు మధ్య ప్రపంచటెస్టు చాంపియన్​షిప్​ ఫైనల్​ జరగనున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిచర్డ్ హెడ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘బుమ్రా ఎక్కువ పరుగెత్తకుండానే అద్భుతమైన టెక్నిక్​తో బౌలింగ్​ చేస్తాడు. అది నమ్మశక్యంగా లేకపోయినా, ఎంతో ప్రభావితంగా ఉంటుందని నిరూపించాడు.​ బంతిని విసిరేటప్పుడు చివరిక్షణంలో తన పూర్తి శక్తిని ఉపయోగిస్తాడు. భుజ బలంతోనే బంతిని వేగంగా విసురుతాడు.’అని హెడ్లీ చెప్పుకొచ్చాడు. అయితే బుమ్రాకు ఉన్న అసాధారణమైన బౌలింగ్​ టెక్నిక్​ వల్ల అతను ఎక్కువగా గాయాల బారిన పడే అవకాశముందని తెలిపాడు. “బుమ్రా సుదీర్ఘ కాలం ఆడుతాడా లేదా అనేది చెప్పడం కష్టం. అతని విభిన్నమైన బౌలింగ్​ టెక్నిక్ వల్ల ఎక్కువగా గాయాలకు గురి అవుతాడని అనుకుంటున్నా.’అని హెడ్లీ సందేహం వ్యక్తం చేశాడు.

Related posts