telugu navyamedia
రాజకీయ

ధోనీ కొత్త లుక్ అద‌ర‌హో..!

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కొత్త లుక్ అద‌ర‌హో అంన్న‌ట్టు ఉంది..! ఆటతోనే కాదు.. తన స్టైల్‌ తోనూ అభిమానులను మెస్మ‌రైజ్ చెస్తాడు. టీమిండియాలోకి వచ్చిన కొత్తలో ధోని ఓ స్టయిల్‌ ఐకాన్‌లా ఉండేవాడు. పొడ‌వైన‌ జట్టుతో అభిమానులను అక‌ట్టుకున్నాడు. ఆ తరువాత ఫంకీ ఎయిర్‌ స్టైల్‌తో కూడా తన మార్క్‌ చూపించాడు.

ప్రస్తుతం మ‌రో కొత్త హెయిర్‌ స్టైల్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ధోనీ హెయిర్‌ స్టైల్‌, న్యూ లుక్ సూప‌ర్‌గా ఉంద‌ని అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. ధోనీకి సంబంధించి ఏ చిన్న విషయం అయినా క్రికెట్‌ అభిమానులకు వెరీ ఇంట్రెస్టింగే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన ఫామ్‌ హౌజ్‌లో సేంద్రియ వ్యవసాయంతో పాటు కడక్‌నాథ్‌ కోళ్లను ధోనీ పెంచుకుంటున్న సంగతి అందరికీ విదితమే.

కాగా, అంతర్జాతీయ టెస్ట్‌, వన్డేల నుంచి ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. టి20లు మాత్రం ఆయన ఆడుతున్నాడు. మరోవైపు ఐపిఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టుకు ధోని నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు ఐపిఎల్‌లో అత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరిన జట్టుగా సిఎస్‌కె రికార్డు సృష్టించింది.

Related posts