telugu navyamedia
రాజకీయ వార్తలు

నాలుగు గంటలు పని చేయని ఎయిర్ టెల్ నెట్వర్క్…

Airtel

మన దేశంలో ఎయిర్ టెల్ కు కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు.  జియో నుంచి గట్టిపోటీని ఎదుర్కొనడంతో ఎయిర్ టెల్ తమ పరిధిని పెంచుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నది. ఎయిర్ టెల్ నెట్వర్క్ రాని ప్రాంతం అంటూ ఉండదు అని అంటుంటారు.  కానీ, ఎయిర్ టెల్ గత నాలుగు గంటలుగా హర్యానాలోని అనేక ప్రాంతాల్లో నెట్వర్క్ డౌన్ అయ్యింది.  నాలుగు గంటలుగా ఎయిర్ టెల్ నెట్వర్క్ పనిచేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.  ఎయిర్ టెల్ కు ఏమైందని అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇండియాలో ఫాస్టెస్ట్ నెట్వర్క్ గా పేరు తెచ్చుకున్న ఎయిర్టెల్ పనిచేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని, ట్రాన్సక్షన్స్ కావడం లేదని నెటిజన్లు చెప్తున్నారు.  అయితే, ఎందుకు పనిచేయడం లేదు అనే విషయంపై ఎయిర్ టెల్ నెట్వర్క్ కూడా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు.  కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచే నెట్వర్క్ నిలిచిపోయినట్టు నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే దీని పై ఎయిర్ టెల్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

Related posts