తనను సస్పండ్ చేసే అధికారం పీసీసీలో ఎవ్వరికీ లేదని కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై సర్వే ఘాటుగా స్పందించారు. తాను ఏఐసీసీ సభ్యుడినని, తనను సస్పండ్ చేసే అధికారం పీసీసీలో ఎవ్వరికీ లేదని అన్నారు. గతంతో కేంద్రమంత్రిగా వ్యవహరించానని, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీకి విధేయుడినని సర్వే అన్నారు. ఉత్తమ్, కుంతియా వల్లనే పార్టీ ఓడిపోయిందని, ఓటమికి కారణమైనవాళ్లే సమీక్ష చేయడమేంటని ప్రశ్నించానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధిష్టానం వీరికి సమీక్ష చెయ్యమని చెప్పలేదని, ఎన్నికల్లో పోటీ చెయ్యని వాళ్లు సమీక్ష సమావేశంలో ఉండటమేంటని ఆయన ప్రశ్నించారు.కొందరు కావాలనే తనపైకి రౌడీ ముకలను ఎగదోషారని, అందుకే వారికి గట్టిగా సమాధానం చెప్పానని సర్వే వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్, కుంతియాలు టికెట్లు అమ్ముకున్నారని, టీఆర్‌ఎస్‌కు వారు కోవర్టులుగా పనిచేశారని ఆరోపించారు.