telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ : .. నిరుద్యోగం .. ఇంకా మోసపుతూనే ఉన్న యువత…

unemployment causes cheating

దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతుందని కొన్ని కొన్ని సందర్భాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమస్యను కొందరు స్వలాభానికి వాడుకుంటూ, నిరుద్యోగ యువతను నిలువునా ముంచేస్తున్నారు. తాజాగా, స్టాప్ సెలక్షన్ కమిషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఏఈ) ఇంజినీర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ. 78 లక్షలు మోసం చేసిన ఓ ఘరాన మోసగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. జాయింట్ సీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన తంగెడ వెంకట శివనాగ సుబ్రహ్మణ్య వర ప్రసాద్ వృత్తిరీత్యా న్యాయవాది. మూసారాంబాగ్‌లో నివాసముంటున్నాడు.

హిమయత్‌నగర్‌కు చెందిన కొటగిరి రామారావుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఉద్యోగం ఇప్పించకుండా తనను మోసం చేశాడంటూ సీసీఎస్‌లో బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు వరప్రసాద్‌రావును అరెస్టు చేశారు.

Related posts