telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆర్సీబీ పరువు తీసిన చెన్నై…

ప్రస్తుతం మన దేశంలో ఐపీఎల్ పండుగ ప్రారంభమైంది. దాంతో ట్విట్టర్ లో ఎప్పుడు దానిపైనే చర్చ జరుగుతూఉంటుంది. ఈ క్రమంలో ట్విటర్ ఇండియా తమ యూజర్లను మరింత ఆకట్టుకునేందుకు ఫ్రాంచైజీల ఏమోజీలను విడుదల చేసింది. అయితే ఈ ఏమోజీల విషయంలో ట్విటర్ ఇండియా ఘోర తప్పిదం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏమోజీగా పేర్కొంది. ఈ తప్పిదాన్ని గుర్తించిన అభిమానులు వెంటనే ట్విటర్ ఇండియాను ట్రోల్ చేశారు. అలాగే ఆర్‌సీబీ టీమ్‌పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆర్‌‌సీ బీపై తమదైన శైలిలో సెటైర్ వేసింది. సౌతిండియా సూపర్ స్టార్ ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీ ‘నరసింహా’లోని ఓసీన్‌కు సంబంధించిన మీమ్‌ను షేర్ చేసింది. ఈ సీన్‌లో ఎర్ర చీర కట్టుకున్న సౌందర్యపై రజనీకాంత్ పసుపు నీళ్లు పోస్తాడు. అయితే దీన్ని తీవ్ర అవమానంగా భావించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ట్విటర్ ఇండియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందు మంచి టెక్ ఇంజనీర్‌ను నియమించుకోవాలని, ఉద్యోగ నియమకాలను చేపట్టడానికి బెంగళూరు సరైన ప్రదేశమని చురుకలంటించింది.

Related posts