telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

చిరంజీవి అభిమానుల కోసం .. కొత్త పథకం..

Chiranjeevi

ఎన్టీఆర్ నాగేశ్వరరావుల తరువాత ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగిన ఏకైక స్టార్ చిరంజీవి మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను కలిగిన చిరంజీవి తన అభిమానుల చేత సేవా కార్యక్రమాలు చేయిస్తూ ఒక కొత్త ఒరవడికి కొన్ని దశాబ్దాల క్రితమే శ్రీకారం చుట్టాడు. అతడికి ఉన్న మెగా అభిమానుల సపోర్ట్ రాజకీయాలలో పెద్దగా కలిసిరాకపోయినా ఇండస్ట్రీలో తన మెగా స్టార్ హోదాను కొనసాగించడంలో ఇప్పటికీ ఉపయోగపడుతు అతడి స్థానాన్ని చెక్కు చెదరకుండా మెగా అభిమానుల సపోర్ట్ చిరంజీవిని ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలో ఉండేలా చేస్తోంది. చిరంజీవి తన అభిమాన సంఘాలకు ప్రత్యేక స్థానాన్ని ఇవ్వడం అతడి అలవాటు. దానితో ప్రతీ జిల్లాల్లోనూ చిరంజీవి అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. దక్షిణాది సినిమా రంగంలో రజినీకాంత్ తరువాత వేల సంఖ్యలో అభిమాన సంఘాలు ఉన్నది ఒక్క చిరంజీవికి మాత్రమే చిరు సినిమా వస్తోందంటే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. అంతలా తన ఎదుగుదల కోసం అండగా నిలిచిన అభిమానుల కోసం ఎవరూ చేయని పనిని మెగాస్టార్ చిరంజీవి చేయడానికి శ్రీకారం చుట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

నాలుగు దశాబ్దాలుగా తనకు అండగా నిలిచి తన ఎదుగుదలకు కారకులైన అభిమానుల కోసం చిరంజీవి ఒక వినూత్న పథకాన్ని ఆలోచిస్తున్నట్లు టాక్. తన అభిమానులు అందరికీ ఇన్సూరెన్స్ చేయించే ఆలోచనలలో చిరంజీవి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యక్రమాల్ని రూపు దిద్దే పనిలో మెగా స్టార్ ఉన్నట్లు టాక్. ప్రమాద వశాత్తు అభిమానుల్లో ఎవరైనా చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ భీమా ఉంటుందని అంటున్నారు. తన మెగా అభిమానులు అందర్నీ ఈ పథకంలోకి తీసుకురాబోతున్నారట. తన అభిమానుల కోసం చిరంజీవి తల పెట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది.

Related posts