telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేవంత్‌కు షాక్‌.. టీపీసీసీ చీఫ్‌గా సీనియర్‌ నేత!

congress flags

టీపీసీసీ అధ్యక్ష నియామకం పై ఉత్కంఠ కొనసాగుతున్నది. పీసీసీ రేసులోకి తెరమీదకొచ్చిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు… ఇప్పటికే తన అభిప్రాయాన్ని తెలుసుకున్నారు హస్తిన పెద్దలు. రేవంత్ ను కొందరు వ్యతిరేకిస్తుండటం తో మద్యే మార్గంగా సీనియర్ల పేర్లను పరిశీలిస్తుంది కాంగ్రెస్ హైకమాండ్. పరిశీలనలో జానారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి మరికొందరి పేర్లు.. అందరికీ ఆమోదయోగ్యమైన నేతలెవరన్న దాని పై అభిప్రాయాలు తీసుకుంటున్నది హైకమాండ్. రాష్ట్రానికి రహస్యంగా కాంగ్రెస్ అధిష్టానం దూతలు… పలువురు రాష్ట్ర నేతలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలో వర్గపోరు నేపథ్యంలో ఠాగూర్ నివేదిక పై క్రాస్ చెక్ చేస్తోన్న ఢిల్లీ పెద్దలు.. అధిష్టానానికి ఇంచార్జి కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస కృష్ణన్ విడివిడిగా నివేదికలు ఇచ్చారు. రేవంత్ కు పీసీసీ ఇవ్వలేకపోతే ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించే యోచనలో ఉంది హై కమాండ్‌. సిడబ్ల్యూసీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను తీసుకోనున్నారు. తమిళనాడు లాగా పీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటే జంబో కమిటీల ప్రకటన కోసం కసరత్తు చేస్తోంది హైకమాండ్‌.

Related posts