telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ధీర’ ఫస్ట్ లుక్ రిలీజ్‌..మొత్తం 12 భాషల్లో

శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఒకరిగా ఉన్న తెనాలి రామకృష్ణ ఎంతో ప్రసిద్ధి చెందిన వారో చెప్పనక్కర్లేదు. ఎందుకంటే తెనాలి రామకృష్ణ అంత ఫేమస్‌. ఆయన వికటకవిగా ప్రసిద్ధి చెందాడు. అయితే..ఈ పురాణ కవి తెనాలి రామకృష్ణ ఆధారంగా ఓ యానిమేషన్‌ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా పేరు “ధీర”..దీనికి క్యాప్షన్‌ “బుద్ధి రిద్ధి సిద్ధి”. భారత దేశపు అతి పెద్ద మోషన్‌ క్యాప్చర్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అరుణ్‌ కుమార్‌ రాపోలు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమాకు చెందిన ఫస్ట్‌ లుక్‌ని ఈ చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే… పాన్‌ ఇండియా లెవల్లో 12 భాషల్లో “ధీర” విడుదల కానుంది. అయితే… ఈ సినిమా తెలుగు వర్షన్‌కు టాలీవుడ్‌ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మురళి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ చేస్తున్నది చూడాలి..

Related posts