telugu navyamedia
సినిమా వార్తలు

”గని” విడుదల తేదీ ఫిక్స్‌..

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ”గని”. సయీ మంజ్రేకర్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమవుతోంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్ గా వచ్చిన టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరిని ఆకట్టుకుంది.

Ghani: Gani release date has arrived .. Varun Tej movie release date is  always .. | pipanews.com

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఈ నెల 25న గని సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అదిరిపోయే పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. పంచ్ బ్యాగ్ ను చాలా ఫోర్స్ గా వరుణ్ కొడుతున్నట్టు ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు.

Varun Tej's Ghani shoot postponed amid Covid-19 scare - Movies News

 

ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. మూడేళ్ల కష్టానికి.. తగిన ప్రతిఫలం అందుకునే సమయం వచ్చిందని, ప్రేక్షకుల ఆదరాభిమానాలను తప్పకుండా అందుకుంటామన్న నమ్మకం తమకు ఉందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు

ఈ సినిమాలో జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందించారు.

Related posts