బీజు మీనన్.. పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ ఘన విజయం సాధించింది. దీని రీమేక్ రైట్స్‌ను సితార ఎంటర్టైన్‌మెంట్స్ దక్కించుకుంది. సాగర్ కె చంద్ర దర్శకుడు. ఇందులో పవన్ బీజూ మీనన్ పోషించిన శక్తిమంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. పృథ్వీరాజ్ రోల్ లో రానా నటిస్తున్నాడు. దీనిపై మొన్ననే క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. అయితే…నుంచి మరో వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బిగ్‌బాస్ బ్యూటీ దివి నటించబోతుందట. మంచి రోల్ కావడంతో దివి ఈ ఛాన్స్‌కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందట. కాగా.. బిగ్‌బాస్-4 ఫినాలే కార్యక్రమానికి హాజరైన చిరంజీవి కూడా దివికి సినిమా ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో వస్తున్న తన సినిమాలో దివికి పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇవ్వనున్నట్లు మెగాస్టార్ ప్రకటించారు. కాగా… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ వకీల్ సాబ్ సినిమాతో ఇవ్వనున్నాడు. ఈ సినిమాను హిందీ మూవీ పింక్‌కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు.
previous post
next post
సెక్రటేరియట్ వాస్తు ప్రభావం వల్ల ‘దొర’కి ఆరోగ్యం బాగుండటం లేదంట.. మాధవీలత షాకింగ్ పోస్ట్