telugu navyamedia
సినిమా వార్తలు

చైతన్యతో విడాకుల తర్వాత చనిపోతా అనుకున‍్నా..

ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స‌మంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో త‌న‌కంటూ ఓ స్థానం సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే తన నటనతో టాలీవుడ్ అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించి టాప్ హీరోయిన్‏గా కొన‌సాగుతుంది. సినిమాలతో పాటుగా సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

Samantha Ruth Prabhu files defamation cases against YouTube channels |  Telugu Movie News - Times of India

తన సోషల్ మీడియా ఖాతాలో తన మనసులోని భావాలను, అనుభూతులను, మోటివేషనల్ కోట్స్ పెడుతూ.. అభిమానుల‌తో పంచుకుంటుంది. అలాగే సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇస్తూ ఉంటుంది.అయితే ఇప్పటివరకు వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలపై.. పరిస్థితుల గురించి ఇటు సమంతగానీ.. నాగచైతన్య గానీ స్పందించలేదు..

Infidelity Or Bold Roles Is The REAL Reason Behind Samantha Naga Chitanya

అయితే తాజాగా ఈ అంశంపై సమంత స్పందించింది. అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత వారి విడాకులపై సమంత స్పందించడం ఇదే తొలిసారి. ‘నేను విడాకులు తీసుకున్నప్పుడు కుంగిపోయి చనిపోతానని అనుకున్నాను. నేను చాలా బలహీనమైన వ్యక్తినని నా ఫీలింగ్‌. కానీ ఇంత బలంగా ఉంటాను అనుకోలేదు. నేను ఎంత బలంగా ఉన్నానో తెలిసి ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. నేను ఇంత దృఢంగా ఉంగలనని అనుకోలేదు..ఇలా ఎలా ఉన్నానో నాకు తెలియడం లేదు’ అని ఓ ఇంగ్లీష్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సమంత.

South India Actress Samantha Dons Bridal Avatar, Pics Go Viral

ఇక సినిమాల విషయానికి వచ్చేసరికి తెలుగులో శాకుంతలం సినిమాని చేస్తోంది సామ్.. ఈ సినిమాతో పాటుగా తమిళ్ లో ఓ సినిమా చేస్తోంది. ఓ హాలీవుడ్ మూవీకి కూడా ఒకే చెప్పింది సామ్.

 

Related posts