telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మళ్ళీ మనసు స్పందించింది .. ప్రేమలో పడిపోయాను .. : అమలాపాల్

Amala-Paul

ప్రస్తుతం ఆమె చిత్రంతో బిజీగా ఉన్న కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన న్యూడ్ సీన్లకు సంబంధించిన ప్రోమోలు, స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. చాలా సంప్రదాయంగా ఉండే అమల ఇలాంటి పాత్ర ఎందుకు చేసిందన్న ప్రశ్నలు కూడా రైజ్ అవుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో ఆమె పలు సంచలన విషయాలు బయటపెట్టారు. అమల కోలీవుడ్ దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక మూడేళ్లకే అతడితో విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ ఓ డాక్టర్‌ను రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెళ్లి తర్వాత చాలా మందికి కెరీర్‌ని ఎఫెక్ట్‌ చేస్తుందేమో? అనే ఆలోచన ఉండేది. పెళ్లి తర్వాత కెరీర్‌ అయిపోతుంది.. సెపరేట్‌ అయిన తర్వాత ఆంటీ పాత్రలే, సీరియల్సే అని చుట్టూ ఉన్నవాళ్లు భయపెడతారని చెప్పింది.

మనలో టాలెంట్ ఉంటే మనకు ఎప్పుడూ అవకాశాలు వస్తాయనే తాను నమ్ముతానని అమల తెలిపింది. విజయ్‌తో విడిపోయాక చాలా సీరియస్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నానని చెప్పిన ఆమె తన మాజీ భర్త విజయ్ గురించి మాట్లాడుతూ విజయ్‌ చాలా స్వీట్‌ పర్సన్‌. అమేజింగ్‌ సోల్‌. అతని లైఫ్‌ బ్యూటిఫుల్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ దంపతులకు ఎక్కువమంది పిల్లలు పుట్టాలి. హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానని అంది. ప్రస్తుతం లవ్‌లో ఉన్నానని… దాన్ని అలానే ఉండనిస్తాం. దేని గురించీ ఎక్కువ ఆలోచించడం లేదని కూడా తెలిపింది. కొత్త ప్రేమతో అమల సరికొత్త ఇన్సింగ్స్‌కు రెడీ అయ్యింది. మరి ఆమె కొత్త ప్రియుడు ఎవరో ? కొద్ది రోజుల తర్వాత అయినా తెలియక తప్పదు కదా..!

Related posts