telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కడప జైలు సూపరింటెండెంట్ వరుణారెడ్డి బదిలీ..

కడప జిల్లా జైలు సూపరింటెండ్ గా ఉన్న వరుణా రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వరుణారెడ్డిని బంగోలుకు బదిలీ చేస్తూ మంగళవారం నాడు ఉత్తర్వులిచ్చింది. అదే సమయంలో, ఒంగోలు జైలు సూపరింటిండెంట్‌గా ఉన్న ప్రకాశ్‌ను కడప జైలుకు బదిలీ చేసింది ప్రభుత్వం.

వరుణారెడ్డిని కడప సెంట్రల్ జైలుకు ఈ నెల మూడో తేదీనే జైలర్‌గా నియమించింది ప్రభుత్వం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మొద్దు శీనును ఓం ప్రకాష్ అనే వ్యక్తి హత్య చేశాడు. అయితే ఈ సమయంలో అనంతపురం జైలులో వరుణారెడ్డి జైలు సూపరింటెండ్ గా ఉన్నారు.

అయితే ఇప్పుడదే వరుణారెడ్డి కడప జైలర్‌గా వేశారని, అదే జైలులో ఉన్న వివేకానంద రెడ్డి హంతకులకు ప్రాణహాని ఉందని అభ్యంతరం వ్య‌క్తం అయ్యాయి. 

ఈ విషయమై తెదేపా అధినేత‌ చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ విషయమై సీబీఐకి కూడా లేఖ రాశారు. ఈ తరుణంలోనే వరుణారెడ్డిని కడప నుండి ఒంగోలు జైలుకు మంగళవారం నాడు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Related posts