telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

భారత్ లో కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా ప్రతిరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూపోతున్నాయి చమురు సంస్థలు.. ఇవాళ అదనంగా మరో 30 పైసల భారం మోపాయి ఆయిల్‌ కంపెనీలు.. దీంతో పెట్రో ధరలు దేశంలో సరికొత్త రికార్డులు నెలకొల్పాయి.. తాజా వడ్డింపుతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 86.65కు చేరుకోగా.. డీజిల్ ధర రూ.76.83కు పెరిగింది. ఇక ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్‌ ధరలను పరిశీలిస్తే.. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ రూ.89.54, లీటర్‌ డీజిల్‌ రూ. 80.44గా ఉండగా.. ముంబైలో పెట్రోల్‌ రూ. 93.42, డీజిల్‌ రూ. 83.99కి చేరింది. ఇక, చెన్నైలో పెట్రోల్‌ రూ. 89.13 కి, డీజిల్‌ రూ. 82.04 కి పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ. 90.42 గా, డీజిల్‌ రూ. 84.14 గా అమ్ముడుపోతోంది. వివిధ స్థానిక పన్నులు మరియు వ్యాట్ విధించినందున ఆటో ఇంధనాల ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరకంగా భిన్నంగా ఉంటాయి. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధర గత 20 రోజులలో స్థిరంగా ఉన్నప్పటికీ, దేశీయ చమురు సంస్థలు మాత్రం వడ్డింపు ఆపడంలేదు.. ప్రస్తుతం క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌ 55 నుంచి 56 డాలర్ల మధ్య కొనసాగుతోంది.

Related posts