telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

ఎల్.ఐ.సి .. భారీ ఉద్యోగ ప్రకటన..

job notification from LIC

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ భారత దేశంలో ఎంతో మందికి కుటుంభంలో వ్యక్తిని కోల్పోయిన తరువాత ఆర్ధిక భరోసా ఇచ్చింది. ఈ క్రమంలోనే LIC అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో మందికి ఉపాది అవకాశాలు కూడా కల్పించింది. ఈ సంస్థలో చేరడానికి చాలా మంది నిరుద్యోగులు ఆసక్తికనబరుస్తారు కూడా. అయితే తాజాగా LIC నుంచీ ఉద్యోగ ప్రకటన వెలుబడింది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న డివిజినల్ కార్యాలయాలలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గ్రీన్ సింగల్ ఇచ్చింది. అందుకు అనుగుణంగా అర్హులైన అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులని ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు : 8500

అర్హత : బ్యాచిలర్ డిగ్రీ
వయసు : 18-30
ఎంపిక విధానం : ప్రిలిమినరీ, మెయిన్స్, మెడికల్ టెస్ట్
దరఖాస్తు విధానం : ఆన్లైన్
ప్రిలిమినరీ పరీక్ష తేదీ : అక్టోబర్ 21, 22 -2019
దరఖాస్తు చివరి తేదీ : అక్టోబర్ , 1 , 2019

మరిన్ని వివరాలకోసం : https://licindia.in/

Related posts