హైదరాబాద్ షాద్ నగర్ లో నకిలీ డాక్టర్ అరెస్ట్ అయ్యాడు. ఎంబిబిఎస్ డాక్టర్ అవతారం ఎత్తిన వార్డ్ బాయ్ ప్రవీణ్.. కోవిడ్ ట్రీట్మెంట్ పేరుతో లక్షలు దండుకున్నాడు. అసలు రహస్యం బయటపడటంతో.. ఎంబిబిఎస్ పట్టా లేకుండా ప్రవీణ్ వైద్యం చేస్తున్నాడు అంటూ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో పలు ఫిర్యాదులు అందాయి. దీంతో 420, 336 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు.. వివిధ ఫిర్యాదులతో షాద్ నగర్ అమ్మ హాస్పిటల్ ను సీజ్ చేశారు డిప్యూటీ DMHO. ట్రీట్మెంట్ పేరుతో పలువురిని సీరియస్ స్టేజ్ కు తీసుకెళ్లిన నకిలీ డాక్టర్ ప్రవీణ్.. ENT డాక్టర్ M.ప్రవీణ్ కుమార్ పేరుతో లైసెన్స్ పొంది తానే ఒరిజినల్ ప్రవీణ్ కుమార్ గా చలామణి అవుతున్నాడు. అనుభవం లేని వైద్యులను తీసుకొచ్చి ఎంబిబిఎస్ డాక్టర్స్ అంటూ వైద్యం చేపిస్తున్నాడు నకిలీ డాక్టర్ ప్రవీణ్. గతంలోనూ మహబూబ్ నగర్ లోని నవోదయ హాస్పిటల్ వార్డ్ బాయ్ గా ఫేక్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ పనిచేశాడు.
previous post