ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోయే 20వ సినిమా “జాన్” (వినిపిస్తున్న టైటిల్) లవ్ స్టోరీ కావడంతో దీన్ని హిందీలో విడుదల చేసే ధైర్యం ప్రభాస్ చేయరని కథనాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లో విడుదలవుతుందని స్పష్టం చేసింది. నిర్మాత ఎస్కేఎన్ కూడా ట్విట్టర్ ద్వారా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ‘‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో హిందీ వర్షన్ చాలా మంది బాలీవుడ్ స్టార్స్ సినిమాల కన్నా ఎక్కువే వసూలు చేసింది. బాక్సాఫీసు వద్ద స్పష్టమైన విజయాన్ని అందుకుంది. ప్రభాస్ 20వ సినిమా బహుబాషా చిత్రం. హిందీలో కూడా తెరకెక్కుతుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొన్ని రోజుల్లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం భారీ సెట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది’’ అని ఎస్కేఎన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో హిందీ మీడియాను ఇక మూసుకోండి అన్నట్టుగా చెప్పారు ఎస్కేఎన్. మన రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో నేషనల్ స్టార్ అయిపోయారు. ఆల్ ఇండియా లెవల్‌లో ఫ్యాన్ బేస్‌ని సంపాదించుకున్నారు. ‘సాహో’ సినిమా తెలుగులో పెద్దగా రాణించలేకపోయినా బాలీవుడ్‌లో ఓ రేంజ్ కలెక్షన్స్ సాధించిందంటే దానికి కారణం అక్కడ ఆయనకున్న ఫ్యాన్స్. కానీ ‘సాహో’ సినిమా హిందీలో లాభాలు తెచ్చిపెట్టినా విమర్శకుల రేటింగ్‌ను పట్టుకుని ఫ్లాప్ అంటున్నారు. వాస్తవానికి ‘సాహో’ హిందీ వర్షన్ రూ.145 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. ఇప్పుడు నిర్మాత ఎస్కేఎన్ “సాహో” ఫ్లాప్ అంటూ కామెంట్లు చేస్తున్న వారందరికీ గట్టిగానే ఇచ్చారుగా పంచ్.
Young Rebel Star #Prabhas #Saaho #Hindi version collected at par & bigger than many Bollywood stars films and a clear winner at Box office. #Prabhas20 is a multilingual film including Hindi. #Prabhas20 regular shoot starts in few days. (Huge Set work going briskly ) pic.twitter.com/qIocnS2eTD
— SKN (@SKNonline) 10 November 2019