telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పాకిస్థాన్ లో చైనా వ్యాక్సిన్‌…

china pakistan corona

చైనా నుండి కరోనా వచ్చింది అని చాలా దేశాలు ఆ దేశంలో సంబంధాలు తెంపుకున్నాయి. అయితే ఆ వైరస్ వచ్చిన తర్వాత నుండి కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులను చూసి ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. వ్యాక్సిన్ విజయవంతం అయినప్పటికీ ప్రజల్లో భయం అలానే కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్‌లో కూడా ఈ నెల 16నుంచి కరోనా వ్యాక్సిన రన్ మొదలయింది. అయితే ఇదే క్రమంలో కరోనా వ్యాక్సిన్‌ కోసం పోటీ పడిన దేశాల్లో చైనా కూడా ఒకటి. అయితే ఇటీవల చైనా తన వ్యాక్సిన్ తయారీ పూర్తయిందని, దీని ద్వారా కరోనాను నియంత్రించ వచ్చని ప్రకటించింది. కానీ ప్రపంచదేశాలు దానిపై మొగ్గు చూపలేదు. అయితే తాజాగా చైనా వ్యాక్సిన్‌కు పాకిస్తాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో అత్యవసర పరిస్థితుల్లో చైనా వ్యాక్సిన్ సినోఫార్మ్‌ను వాడేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇచ్చిన అనుమతుల గురించి పాకిస్థాన్ రెగ్యులేటరీ బోర్డు వారు ప్రకంటించారు. అంతేకాకుండా ప్రతి మూడు నెలలకి ఒకసారి వ్యాక్సిన్‌ల నిల్వ, భద్రత, సామర్థ్యం, ప్రభావాలపై ప్రత్యేక సమీక్షను నిర్వహిస్తామని తెలిపింది. అయితే సినోఫార్మ్‌ను బీజింగ్ ఇస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ తయారు చేసింది. ఆ కంపెనీ చెప్పేదాని ప్రకారం ఈ వ్యాక్సిన్ సామర్థ్యం 79.3శాతంగా చెబుతోంది. ఈ వ్యాక్సిన్ వినియోగానికి పాకీస్థాన్ కాకుండా యూఏఈ, బహ్రెయిన్ దేశాలు అనుమతించాయి. చూడాలి మరి ఈ వ్యాక్సిన్ ఎంతలా పని చేస్తుంది అనేది.

Related posts